విద్యార్థుల వ్యక్తిగత వికాసం చాలా ముఖ్యం.. మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యార్థుల వ్యక్తిగత వికాసం చాలా ముఖ్యం.. మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యార్థుల్లో వ్యక్తిగత వికాసం చాలా ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం ఉన్న ప్పుడే ఉన్నత విలువల అబ్బుతాయి.. ఉన్నతస్థానాలకు ఎదుగుతారని అన్నారు. గురువారం (జనవరి 22) బాచుపల్లి కేఎల్ హెచ్  లో ‘‘వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువల అంశం’’పై చర్చ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివివేక్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. 

ప్రతీ విద్యార్థికి  క్రమశిక్షణ అవసరం.. క్రమశిక్షణతో కూడిన జీవితం..అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుందన్నారు. విద్యార్థులకు కాలేజీ డేస్ అనేవి బెస్ట్ డేస్ అన్నారు.. కాలేజీ చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు స్వతహాగా మంచి అలవాట్లు క్రియేట్ చేసుకోవాలన్నారు. హార్డ్ వర్క్, డిస్ ప్లేనే మిమ్మల్ని కాపాడుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 

మాజీ కేంద్ర మంత్రి కాకా వెంటకస్వామి  కార్యకర్త నుంచి ఎదిగిన నేత.. లేబర్ మినిస్టర్ గా ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రస్తుతం మాకు 12 రాష్ట్రాల్లో పరిశ్రమలున్నాయి. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ ఉన్నారు.. థర్డ్ జనరేషన్ ను కూడా ప్రజలు ఆదరించారన్నారుమంత్రి వివేక్ వెంకటస్వామి.