ఆధ్యాత్మికం: వన దేవతల జాతర.. మేడారం జాతర.. గిరిజనుల పండగ.. విశిష్టత.. ప్రాధాన్యం ఇదే..!

ఆధ్యాత్మికం:  వన దేవతల జాతర.. మేడారం జాతర..  గిరిజనుల పండగ..  విశిష్టత.. ప్రాధాన్యం ఇదే..!

 ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని  ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.   ఈ ఏడాది(2026)  జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం  4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క-సారలమ్మలు ఎవరు, వారి చరిత్ర ఏమిటి, ఈ పండుగ ఎలా ప్రారంభమైంది అనే వివరాలను తెలుసుకుందాం.

మేడారం అంటే గొప్ప జాతర .. రెండేళ్ల కొకసారి వన దేవతలు భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. ఇది కేవలం జాతర మాత్రమే కాదు.. ప్రపంచంలోనే  అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్దికెక్కింది. 

ALSO READ : వసంతపంచమి (జనవరి 23 ).. అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తం ఇదే..!

జాతర వచ్చిదంటే  తెలుగు రాష్ట్రాలతో పాటు.. భారతదేశం.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు  మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు. కుంభమేళా తర్వాత కోట్ల సంఖ్యలో భక్తులను ఆకర్షించే అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది.జాతర  నాలుగు రోజుల జాతరలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 

ఈ ఏడాది ( 2026)  జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.  ఈ ఏడాది  దేవాలయాన్ని అభివృద్ది  చేశారు.   జాతరకు నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తారు. 

ALSO READ : నిజమైన స్నేహితుడు ఎవరు..

వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ  తల్లి-కూతుర్లు...  తెలంగాణ ప్రాంతాన్ని  కాకతీయ రాజులు  సుమారు 700 సంవత్సరాలు పరిపాలించారు. సమ్మక్క సారలమ్మలు  జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు. గిరిజనుల దొర  మేడరాజు అడవిలో వేటాడుతుండగా.. ఒక పుట్టపై పులులు, సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను చూసి.. ఆ పాపను తీసుకెళ్లి  పెంచుకున్నాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

అప్పటి వరకు కరువు.. కాటకాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు...  సమ్మక్క రాకతో  సమస్యలు తగ్గిపోయాయి.  అంతేకాదు.. ఎలాంటి జబ్బునైనా ఆమె చేతి పసరుతో రోగాలు నయమయ్యాయని చెబుతుంటారు.   యుక్తవయస్సు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు.... గిరిజన దొర...  తన మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు.  వీరి దాంపత్య జీవనంలో  సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పొలవాస ప్రాంతానికి కోయ రాజు కాగా...  పగిడిద్ద రాజు మేడారాన్ని పాలించాడని చరిత్ర ఉంది.

ALSO READ : రథ సప్తమి .. సూర్యభగవానుడి పుట్టిన రోజు.. శుభముహూర్తం.. ప్రాముఖ్యత .. విశిష్టత ఇదే..!

కాకతీయులతో యుద్ధం, త్యాగాలు

కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా, కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క దగ్గర  మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ, వారికి ప్రతి నెలా కప్పం కట్టేవాడు.  మూడు సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోవడం... మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా.. పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, వారి పిల్లలు సారలమ్మ, నాగులమ్మ, జంపన్నతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు.

 బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండి కత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న.. అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. 

ALSO READ : వసంతపంచమి .. చదువుల తల్లి పండుగ ఎప్పుడు..

తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క, ఏమాత్రం వెనుకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే, వెనుక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలుకల గుట్ట వైపు వెళ్లి, నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరిణెగా మారి అదృశ్యమైందని చెబుతుంటారు.

మేడారం జాతర ఆవిర్భావం వివరాలు

సమ్మక్క అదృశ్యమైన తర్వాత, గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి. ‘ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకొకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తాను’ అని ఆ మాటల సారాంశం. ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు.. ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తునిగా మారిపోయాడు. ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి, సమ్మక్క వెలిసిన చోట రెండు గద్దెలను కట్టించి, ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు.

ALSO READ : వందేళ్ల తరువాత మకరంలోకి మూడు పవర్ ఫుల్ గ్రహాలు..

అప్పటి నుంచి ఇప్పటి వరకు  ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహా జాతర జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సంప్రదాయాలు పాటిస్తారు. 
మొదటి రోజు :  కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. 
రెండవ రోజు:  చిలుకల గుట్టలోని కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.
మూడవ రోజు:  అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరూ గద్దెలపై కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. నాలుగవ రోజు : సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం 

ఈ పూజలను వంశపారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ.. సమ్మక్క-సారక్కల త్యాగాలను, గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. 

ALSO READ : మూలలు పెరిగిన స్థలం కొనవచ్చా..

ప్రభుత్వ ఏర్పాట్లు - అభివృద్ధి పనులు

ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేస్తోంది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు