
ఆసిఫాబాద్ వెలుగు: వాంకిడిలో వచ్చే నెల 7న జేత్వాన్ బుద్ధ విగ్రహార్ వేదికగా నిర్వహించే వర్షవాస్ ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని బౌద్ధ సంఘం ఆసిఫాబాద్ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయనను హైదరాబాద్లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి వస్తానని చెప్పారన్నారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి దుర్గం సిద్దార్థ, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహుల్కర్, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకుడు, మాజీ కౌన్సిలర్ సునీల్ డోంగ్రే తదితరులున్నారు.