
హైదరాబాద్ సిటీ వెలుగు : తెలంగాణ సెక్రటేరియెట్, ఇంటిగ్రేటెడ్ కమండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆదివారం సందర్శించారు. తొలుత బంజారాహిల్స్‌లోని ఐసీసీసీని సందర్శించి సిటీలో శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగిస్తున్న టెక్నాలజీ, భద్రతా వ్యవస్థల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అశ్విక దళం, స్నిపర్ డాగ్ స్క్వాడ్లతో వారికి స్వాగతం పలికారు.
డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన చర్యలకు మద్దతు వ్యక్తం చేస్తూ ప్లెడ్జ్ వాల్‌పై సిగ్నేచర్లు చేశారు. అనంతరం రాష్ట్ర సెక్రటేరియెట్ప్రాంగణంలో సుందరాంగులు కలియ తిరిగారు. ఆ తరువాత బయట లాన్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలపై డ్రోన్ షోను తిలకించారు. మరోవైపు, మిస్ వరల్డ్ పోటీలు, సన్ఫన్డేలో భాగంగా సందర్శకుల కోసం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన కల్చరల్ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.