మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

మెదక్​ టౌన్, వెలుగు: హవేలీ ఘనపూర్​ మండలంలోని జక్కన్నపేట పంపింగ్​ స్టేషన్​లో మోటార్లు చెడిపోవడం వల్ల మండలంలోని 32 గ్రామాలతో పాటు మెదక్​ మండలంలోని 2 గ్రామాలకు తాగునీరు అందించడంలో అంతరాయం ఏర్పడుతోందని మిషన్​ భగీరథ ఉమ్మడి మండలాల డీఈ పల్లవి తెలిపారు. శుక్రవారం ఆమె పంపింగ్ స్టేషన్​ను పరిశీలించారు. 

అనంతరం మాట్లాడుతూ.. మోటార్ల రిపేర్లకు సమయం పడుతున్నందున మూడు, నాలుగు రోజుల వరకు పంపింగ్​నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బదులుగా ఇంటర్మీడియట్​ పంపింగ్​ స్టేషన్​ నుంచి తాగునీటి సరఫరా చేయడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆమె వెంట మిషనర్​ భగీరథ ఏఈ రజిత, సిబ్బంది ఉన్నారు.