మియాపూర్ గ్యాంగ్ రేప్ నిందితులకు జీవిత ఖైదు

మియాపూర్ గ్యాంగ్ రేప్ నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్: రెండేళ్ల క్రితం మియాపూర్ పరిధిలో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ చేసిన ఆరుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గత 2019 జనవరి 19వ తేదీన ఓ మహిళను  హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలోని ముళ్ల పొదల్లో ఏడుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరు మైనర్ గా తేలింది. 
గ్యాంగ్ రేపు కేసు ఎల్బీనగర్ కోర్టులో విచారణ జరిగింది. నిందితులపై పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఆరుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మరో నేరస్తుడు మైనర్ కావడంతో అతడిపై కేసు పెండింగులో ఉంది.  రేపిస్టులకు కఠిన శిక్ష విధించడంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంతోషం వ్యక్తం చేస్తూ.. బాధితురాలి పక్షాన బలమైన సాక్షాధారాలు సంపాదించి నిందితులపై నేరం రుజువు చేసిన మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు కృష్ణ ప్రసాద్, రవికుమార్ లను సీపీ సజ్జనార్ అభినందనలు తెలియజేశారు.