
అచ్చంపేట, వెలుగు: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్పార్టీ నాయకులు అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగాపూర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అచ్చంపేట క్యాం కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..
వంగూరు మండల కేంద్రంలోని గెల్వాలాంబ మాత అమ్మవారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.