
శాయంపేట, వెలుగు: తెలంగాణలో బోనాలకు ప్రత్యేక స్థానం ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం నిర్వహించగా, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించగా, గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. దేవాలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి సాంబయ్య, మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు వైనాల కుమారస్వామి, మారపల్లి బుజ్జన్న, నిమ్మల సంతోష్, అశోక్, బొమ్మకంటి శ్రీకాంత్, అనంతుల యాదగిరి, భద్రయ్య, ముత్తయ్య, పూజారి మధుమూర్తి పాల్గొన్నారు.