విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు కూడా సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అమీన్​పూర్​మున్సిపల్​ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్​ హాల్​లో వరల్డ్​పవర్​లిఫ్టింగ్​కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4వ ఓపెన్​ స్టేట్​ పవర్​ లిఫ్టింగ్​ఛాంపియన్ షిప్​ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 విజేతలకు సొంతంగా రూ.2 లక్షల నగదు, ప్రైజులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  రాష్ట్రస్థాయి పోటీలకు పటాన్​చెరువు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. 

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పటాన్​చెరులో రూ.7కోట్లతో మైత్రి స్టేడియాన్ని ఆధునీకరించినట్లు తెలిపారు. క్రీడా పోటీల నిర్వహకులు ఇంటూరి రేఖను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.