- ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: రాబోయే మున్సిపల్‌ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగరేయాలని బీఆర్‌ఎస్ సైనికులు ఉత్సాహంగా పని చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేసి రాబోయే మున్సిపల్‌ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అధికారం చేపట్టిన కొద్దిరోజుల నుంచే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
