రాజాపురం గ్రామంలో .. కామరాతి సమేత బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ

రాజాపురం గ్రామంలో .. కామరాతి సమేత బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ
  • ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  

అన్నపురెడ్డిపల్లి, వెలుగు:  మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో కామరాతి సమేత బీరప్ప స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠాపన  కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.  భక్తులు ఉదయం నుంచి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

 భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు.