నవంబర్లో రామచంద్రాపురం హైస్కూల్ వజ్రోత్సవాలు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

నవంబర్లో రామచంద్రాపురం హైస్కూల్ వజ్రోత్సవాలు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: నవంబర్​లో రామచంద్రాపురం హైస్కూల్​ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ పాఠశాల ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన స్కూల్​ను సందర్శించారు. వేడుకల ఏర్పాట్లపై ఎంఈవో రాథోడ్​, కార్పొరేటర్​ పుష్ప, పాఠశాల టీచర్లతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్కూల్​లో వేలాది మంది విద్యనభ్యసించి వివిధ రంగాల్లో ఎదిగారని తెలిపారు.

 వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని చెప్పారు. పటాన్​చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్​ హబ్​గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, పచ్చదనం, ఆర్వో ప్లాంట్ల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాయకులు పరమేశ్​ యాదవ్, ఐలేశ్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

త్వరలో అందుబాటులోకి బంధంకొమ్ము రోడ్డు

అమీన్​పూర్, వెలుగు: చందానగర్​శ్రీదేవి థియేటర్​నుంచి బంధంకొమ్ము మీదుగా అమీన్​పూర్ మహాత్మా గాంధీ విగ్రహం వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. రూ.45 కోట్లతో 150 అడుగుల విస్తరణతో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్​ జ్యోతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్​పాండురంగారెడ్డి, అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. 

రోడ్డు విస్తరణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. తహసీల్దార్ వెంకటేశ్, టీపీవో పవన్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, నాయకులున్నారు.