
తొర్రూరు, వెలుగు: పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని అన్నారు. సోమవారం తొర్రూరు మండలం చెర్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, డాక్టర్ రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభయాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎలాంటి అడ్డంకులు లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం చర్లపాలెంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ముఖద్వారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, పేరటి యాకూబ్ రెడ్డి, ముద్దం విక్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.