
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఉప్పునుంతల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన టీఎల్‌ఎం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్కూళ్లలో విద్యార్థులకు సులభంగా, వినూత్నంగా పాఠాలు అర్థమయ్యేలా టీచర్లు తయారుచేసిన వివిధ రకాల బోధన సామగ్రి ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. సబ్జెక్టుల వారీగా ఉత్తమంగా తయారు చేసిన 12 ప్రదర్శనలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అంతకుముందు సీపీఎస్‌ను రద్దు చేయాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంఈవో చంద్రశేఖర్, హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, టీచర్లు, పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు బిచ్చ్యా నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, రాష్ట్ర కార్యదర్శి అజ్మతుల్లా, రాములు నాయక్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు
వంగూరు/అచ్చంపేట, వెలుగు: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో స్కూల్ బిల్గింగ్‌కు, మండల కేంద్రంలోని స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బల్మూర్ మండలం కొండనాగుల ఉమామహేశ్వర డిగ్రీ కాలేజీలో ఎన్‌సీసీ క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమాల్లో అధకారుల, స్థానిక నేతలు పాల్గొన్నారు.