ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు  ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో జన్నారం, దస్తురాబాద్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అధిక స్థానాల్లో గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. 

వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీ నారాయణ, పొనకల్, పాండ్వాపూర్ సింగల్ విండో చైర్మన్లు అల్లం రవి, శైలజ రమేశ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 

పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యం 

గుడిహత్నూర్, వెలుగు: మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్​లోని టీటీడబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజీలో అధికారులు, లెక్షరర్లు, స్టూడెంట్లతో కలసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణాన్ని పెంచి, పర్యావరణ స్థిరత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం మొక్కలు నాటిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగమై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.