పేదల సొంతింటి కల నెరవేరుతోంది : మామిడాల యశస్వినిరెడ్డి

 పేదల సొంతింటి కల నెరవేరుతోంది : మామిడాల యశస్వినిరెడ్డి

రాయపర్తి, వెలుగు: పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్​ జిల్లా రాయపర్తిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అంతకుముందు వనమహోత్సవంలో భాగంగా మొక్కనాటి నీరుపోశారు. 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ జెండా ఎగరాలని, ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్​ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్, బ్లాక్​కాంగ్రెస్​ అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.