ఎఫ్‌‌2కి మించిన డబుల్ ధమాకా

 ఎఫ్‌‌2కి మించిన డబుల్ ధమాకా

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రగతి. అనేక సినిమాల్లో హీరో, హీరోయిన్లకి తల్లి పాత్రలో మెప్పించింది. ఇప్పుడు ‘ఎఫ్‌‌3’ చిత్రంలో  తమన్నా, మెహ్రీన్‌‌లకు మదర్‌‌‌‌గా నటించింది. వెంకటేష్​, వరుణ్ తేజ్‌‌ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మూవీ మే 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ ‘ఎఫ్‌‌2కి కొనసాగింపుగానే నా పాత్ర  ఉంటుంది. అనిల్ రావిపూడి చాలా పాజిటివ్‌‌గా, రియాల్టీకి దగ్గరగా ఉంటారు. అమాయ‌‌కత్వంతో కూడిన  పాత్రల‌‌తో ఆయ‌‌న క‌‌థ‌‌లు ఉంటాయి. ఇందులో నా క్యారెక్టర్‌‌‌‌ను కొంచెం ఎక్కువగానే చూపించారు. నటిగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపాలనే ప్రయత్నం చేస్తుంటాను. త‌‌మ‌‌న్నా, మెహ్రీన్ పిల్లల్లాంటివారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. చాలా వినోదంగా ఆహ్లాదకరంగా ఉంటుందీ సినిమా.  దిల్ రాజు గారు అంటేనే కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన బ్యానర్‌‌లో న‌‌టించ‌‌డం ఆనందంగా ఉంది. ఎఫ్‌‌2కి మించిన డబుల్ ధమాకా ఈ సినిమాలో ఉంటుంది’ అని చెప్పింది.