రాష్ట్రానికి తల్లి పాల బ్యాంకులు

రాష్ట్రానికి తల్లి పాల బ్యాంకులు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మూడు మదర్ మిల్క్ బ్యాంక్ సెంటర్స్‌‌ను(ఎల్‌‌ఎంసీ) మంజూరు చేసింది. హైదరాబాద్‌‌లోని పేట్లబురుజు హాస్పిటల్, సుల్తాన్‌‌బజార్‌‌ మెటర్నిటీ‌‌ హాస్పిటల్‌‌, రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌ హాస్పిటల్స్‌‌లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెల్త్ ఆఫీసర్లు నిర్ణయించారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక్కో సెంటర్‌‌‌‌కు కేంద్రం రూ.34.44 లక్షలు ఇవ్వనుంది. ఈ సెంటర్లలో తల్లి పాలు సేకరించేందుకు, స్టోరేజ్ చేసేందుకు అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేస్తారు. తల్లి లేని పిల్లలకు, పాలు పడని తల్లుల పిల్లలకు లేదా హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్న తల్లుల పిల్లలకు ఈ పాలను అందిస్తారు.  బాలింతలు ఎవరైనా ఆయా సెంటర్లలో స్వచ్ఛందంగా పాలు దానం చేయొచ్చు. నేషనల్ హెల్త్ మిషన్‌‌లో భాగంగా బ్రెస్ట్‌‌ ఫీడింగ్‌‌ను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీలోఫర్‌‌‌‌ మదర్ మిల్క్ బ్యాంక్ ఉంది. ఓ స్వచ్ఛంద సంస్థ దీన్ని నిర్వహిస్తోంది.
నాలుగు చోట్ల సీఎల్ఎంసీలు
ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌, నల్గొండ డిస్ర్టిక్ట్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం, ఖమ్మం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌‌లోనూ మదర్ మిల్క్ బ్యాంకుల(కాంప్రహెన్సీవ్ లాక్టేషన్ మేనేజ్‌‌మెంట్ సెంటర్స్‌‌– సీఎల్‌‌ఎంసీ) ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఈసారి మరో 6 బ్యాంకులకు నిధులు ఇవ్వాలని స్టేట్ హెల్త్ ఆఫీసర్లు కోరితే అందుకు  నిరాకరించింది. తొలుత మంజూరు చేసిన 4 బ్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం, నిధులు సక్రమంగా వినియోగించుకోకపోవడాన్ని కారణంగా చూపి రిజెక్ట్ చేసింది. ముందు ఆ 4  బ్యాంకుల నిర్వహణపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆఫీసర్లు సూచించారు. బాలింతల నుంచి సేకరించిన పాలను పాస్టరైజ్ చేయడానికి, ఇతరత్ర టెస్టులు చేయడానికి సీఎల్‌‌ఎంసీలలో యంత్రాలు, ఇతర వస్తువులు ఉంటాయి. అలాగే, స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ, ఎల్‌‌ఎంసీ(లాక్టేషన్ మేనేజ్‌‌మెంట్ సెంటర్స్‌‌)లలో ప్రాసెసింగ్‌‌, పాస్టరైజేషన్ ఫెసిలిటీ ఉండదు. 
ఎన్‌‌హెచ్‌‌ఎం కింద మంజూరు చేసిన కేంద్ర సర్కార్