గూగుల్ ఆఫీస్ మూసివేత: ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలనీ ఆదేశం.. ఎందుకంటే ?

 గూగుల్ ఆఫీస్ మూసివేత: ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలనీ ఆదేశం.. ఎందుకంటే ?

న్యూయార్క్ సిటీలో గూగుల్ కంపెనీకి చెందిన  చెల్సియా ఆఫీస్‌లో  బెడ్ బగ్స్ (bed bugs) సమస్య తలెత్తింది. దింతో ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోం చేయాలనీ కోరింది. అలాగే ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పింది.  

అక్టోబర్ 19, 20 తేదీల్లో ఆఫీస్‌లో బెడ్ బగ్స్  ఉన్నాయని మాకు  సమాచారం వచ్చిందని గూగుల్ సంస్థలోని పర్యావరణ, ఆరోగ్యం, భద్రతా విభాగం ఉద్యోగులకు ఇంటర్నల్  ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.

బెడ్ బగ్స్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేదా వాటిని చూసినా/ కనిపించిన వెంటనే ఆఫీస్ ఫెసిలిటీస్  టీమ్‌కి చెప్పాలని  ఈమెయిల్‌లో ఉద్యోగులను కోరారు. ఒకవేళ మీ ఇంట్లో కూడా బెడ్ బగ్స్ కనిపిస్తే వెంటనే బెడ్ బగ్స్ నివారణ నిపుణులను (exterminators) సంప్రదించాలని కూడా గూగుల్ ఉద్యోగులకు సూచించింది.

 బెడ్ బగ్స్ వల్ల మీకు ఏమైనా లక్షణాలు/ అలర్జీ లాంటివి అనిపిస్తే రిపోర్ట్ చేయాలనీ కంపెనీ చెప్పింది.  బెడ్ బగ్స్ నివారణ పూర్తయ్యే వరకు ఉద్యోగులు ఆఫీస్‌కు రావద్దని, సోమవారం నుండి తిరిగి రావొచ్చని తెలిపింది. ముందు జాగ్రత్తగా గూగుల్  ఇతర ఆఫీస్ క్యాంపస్‌లో కూడా  తనిఖీలు నిర్వహించింది. 

గతంలో కూడా  బెడ్ బగ్స్: గూగుల్‌ ఆఫీసులో బెడ్ బగ్స్ సమస్య రావడం ఇదేం మొదటిసారి కాదు. 2010లో మాన్‌హట్టన్‌లోని  9th  అవెన్యూ ఆఫీసుల్లో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అయినప్పటికీ న్యూయార్క్ సిటీ  బెడ్ బగ్స్‌ను నియంత్రించడంలో చాలా అభివృద్ధి చెందింది. 2024లో అమెరికాలో రెండో చెత్త నగరంగా ఉన్న న్యూయార్క్ 2025లో దేశవ్యాప్త బెడ్ బగ్స్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మెరుగుపడింది.