నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు..బాలికపై అత్యాచారం కేసు..దోషికి 32 ఏళ్ల జైలు శిక్ష

నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు..బాలికపై అత్యాచారం కేసు..దోషికి 32 ఏళ్ల జైలు శిక్ష

నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్​పై అత్యాచారం కేసులో దోషికి 32యేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు 75వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇంఛార్జీ జడ్జి రోజారమణి తీర్పును వెలువరించింది. 2022 లో నల్లగొండ టూటౌన్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన బాలిక కిడ్నాప్​, అత్యాచారం కేసులో ఈతీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

2022 సెప్టెంబర్​20న నార్కట్​పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం కు చెందిన బాలిక నల్లగొండ టూటౌన్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో కిడ్నాప్​ కు గురైంది. పోలీసుల విచారణలో పానగల్​ కు చెందిన గురిజాలా చందు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో చందుపై అదే రోజు నల్లగొండ టూ టౌన్​ పీఎస్​ లో బాధితురాలు ఫిర్యాదు మేరకు 366,376,(2)(n)(i)(3)IPC & section 5(i)r/w 6 of POCSO ACT కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

దఫాలుగా కేసు విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు.. తుది తీర్పును బుధవారం వెలువరించింది. సాక్ష్యాలు విన్న తర్వాత తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి రోజారమణి.. నిందితుడు చందూను దోషిగా తేల్చింది.. అతనికి 32ఏళ్ల కారాగార శిక్ష విధించింది. 75వేల రూపాయల జరిమానా తోపాటు బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. 

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఐవోలుగా ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి,డి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఎస్.హెచ్.ఓ సైదులు, సి.ఐ రాఘవరావు వ్యవహరించారు. లైసెన్ ఆఫీసర్ మల్లికార్జున్, నరేంధర్‌,సి.డి.ఓ సుమన్, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన ఉన్నారు.