Allu Sirish-Nayanika: అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక ఫస్ట్ లుక్ లీక్! ఫోటోను క్రాప్ చేసిన స్నేహ రెడ్డి!

Allu Sirish-Nayanika: అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక ఫస్ట్ లుక్ లీక్! ఫోటోను క్రాప్ చేసిన స్నేహ రెడ్డి!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్ వివాహ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం తన కాబోయే భార్య పేరు 'నయనిక' అని, అక్టోబర్ 31న నిశ్చితార్థం జరగబోతుందని శిరీష్ ప్రకటించారు. ఆమె ఫోటోను మాత్రం రహస్యంగా ఉంచారు. అయితే, అల్లు ఫ్యామిలీలో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ఈ సస్పెన్స్ ఒక్కసారిగా వీడింది.

దీపావళి పండుగను పురస్కరించుకుని అల్లు కుటుంబం మొత్తం ఒకచోట చేరి ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డితో పాటు అల్లు బాబీ తమ కుటుంబ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో కుటుంబ పెద్దలు అల్లు అరవింద్, నిర్మల దంపతులు, వారి కుమారులు అల్లు అర్జున్, బాబీ, శిరీష్, కోడళ్ళు, మనవళ్ళు అందరూ కలిసి ఉన్నారు. అంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, క్రాకర్స్ కాల్చి, ప్రమిదలు వెలిగించి ఆనందంగా గడిపారు.

అల్లు స్నేహ పోస్ట్‌లో నయనిక లీక్!

అయితే, ఈ కుటుంబ ఫోటోల పంచుకునే క్రమంలో ఒక ఆసక్తికర విషయం జరిగింది. శిరీష్ వదిన అల్లు స్నేహ రెడ్డి పొరపాటున కొన్ని ఫోటోలను షేర్ చేయగా, అందులో శిరీష్ పక్కనే కూర్చున్నట్టుగా నయనిక మొట్టమొదటిసారిగా కనిపించారు. ఈ విషయం గుర్తించిన స్నేహ, ఆ ఫోటోను వెంటనే డిలీట్ చేసింది. కానీ అప్పటికే అప్రమత్తమైన నెటిజన్లు ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసి వైరల్ చేయడం ప్రారంభించారు.

అసలు విషయం ఏమిటంటే... అల్లు బాబీ, స్నేహ రెడ్డి పంచుకున్న కుటుంబ ఫోట్స్ లో శిరీష్ పక్కన కూర్చున్న నయనికను కావాలనే 'క్రాప్' చేసి, కత్తిరించి పోస్ట్ చేశారు. కానీ, కొద్ది సేపటి తర్వాత స్నేహ షేర్ చేసిన ఒక అన్‌క్రాప్డ్ ఫోటో లీక్ అవ్వడంతో నయనిక అల్లు కుటుంబ వేడుకల్లో పాల్గొన్న విషయం స్పష్టమైంది.

 

ఆ క్రాపింగ్ ఎందుకు?

నయనిక ఫోటోను కావాలనే క్రాప్ చేయడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఫ్యామిలీ ఫోటోలో నయనిక కనిపించడం లేదు, శిరీష్ అన్న వైఫ్ పక్కనే ఉంది. ఏదో దాస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్ల సెక్షన్‌ను నింపేశారు. ఈ క్రాపింగ్‌పై అల్లు కుటుంబం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నయనికతో శిరీష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అక్టోబర్ 1న తన తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నయనికతో కలిసి పారిస్‌లో చేయి పట్టుకున్న ఫోటోను పంచుకుంటూ శిరీష్ తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు.

►ALSO READ | Bigg Boss Telugu 9: ఇమ్ము-తనూజ మధ్య వార్.. కల్యాణ్ డబుల్ గేమ్ తో స్నేహబంధంలో చిచ్చు!

అక్టోబర్‌ 31న హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఆ తర్వాత డిసెంబరులో విదేశాల్లో వీరి వివాహ వేడుక జరగనుందని సమాచారం. నయనికను అల్లు కుటుంబం అధికారికంగా  ఎప్పుడు పరిచయం చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sirish (@allusirish)