రిజనల్ రింగ్ రోడ్డుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలు: ఎంపీ మల్లు రవి

రిజనల్ రింగ్ రోడ్డుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలు: ఎంపీ మల్లు రవి
  • ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ఆయన ఆరోపణలను  తీవ్రంగా ఖండించారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేయాలని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం చెప్పిందని, కానీ ఆ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే ట్రిపుల్ ఆర్ పనులను మొదలు పెట్టామని తెలిపారు.

తమ భూముల కోసం ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డైవర్ట్ చేశామని ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కనీస అవగాహన లేకుండా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి భూముల కోసం ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మళ్లించారనేది అబద్ధమని, ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. అలాగే, రవీంద్ర భారతిలో తనకు ఎలాంటి అవమానం జరగలేదని ఎంపీ అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీటు విషయంలో సెక్యూరిటీతో జరిగిన సంభాషణపై ఆయన స్పందించారు.  సీఎం రేవంత్ రెడ్డి వద్ద తనకు ఇతర ఎంపీల కన్నా ఎక్కువ గౌరవం ఉందని చెప్పారు.