ఎంపీ సీట్లు కేసీఆర్ వేలంలో అమ్ముకున్నడు

ఎంపీ సీట్లు  కేసీఆర్ వేలంలో అమ్ముకున్నడు

హైదరాబాద్: ఎంపీ సీట్లు సీఎం కేసీఆర్ వేలంలో అమ్ముకున్నారన్నారు బీజీపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. గురువారం ఆయన  బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాజీవ్ హయాం నుంచే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వెళ్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ స్కీముకు కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. కేంద్రం పథకాలను టీఆర్ఎస్ తమ స్కీములుగా చెప్పుకుంటుందని.. కేంద్రం డైరెక్టుగా నిధులు ఇస్తే తప్పేముందన్నారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకే టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.   

రాజ్యసభ పొందిన ముగ్గురు 40 ఎమ్మెల్యే స్థానాలను పంచుకున్నారన్న రఘునందన్ రావు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని రాజ్యసభ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నారని చెప్పారు. పెద్దల సభ అంటే  సూటుకేసులు తెచ్చుకున్నోళ్లు వెళ్ళేది కాదన్న ఆయన..  పెద్దల సభకు విజ్ఞులను పంపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఒకరు ఫార్మాలో మందులు అమ్మమంటే బీరువాలో డబ్బులు పెట్టుకున్నారని.. మరొకరు ముఖ్యమంత్రికి డబ్బులు సమకూర్చే CA ..మరొకరేమో అన్ని పార్టీలు తిరిగి,  గ్రానైట్ కుంభకోణంలో ఉన్న వ్యక్తి అన్నారు. పెద్దల సభ అంటే చదువుకున్నోళ్లు వెళ్ళాలి కానీ సంచులు తెచ్చినోళ్లు కాదని తెలిపారు.