సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ  కంటతడి

సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ  కంటతడి

సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో తమ సమస్యలను ఏకరవు పెట్టారు అధికార పార్టీ సభ్యులు. జెడ్పీటీసీలుగా గెలిచి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నామన్నారు. చిన్నచిన్న సమస్యలు తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేయడానికి నిధులు లేవని  ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.దీంతో సమాధానాలు చెప్పలేక జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోవాలని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. 

ఇదే మీటింగ్ లో సంగారెడ్డి ఎంపీపీ  లావణ్య కంటతడి పెట్టారు. ఎంపీడీఓ వేధింపుతో తన  భర్త గుండేపోటుతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో  చైర్మన్ మంజుశ్రీ, వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా పరిషత్ కు జాతీయ అవార్డ్ వచ్చిన సందర్భంగా  చైర్మన్ సీఎం,మంత్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీపీలకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. మీటింగ్ లో అందరూ టీఆర్ఎస్ సభ్యులే అయినప్పటికీ జడ్పీ సమావేశం మొత్తం విమర్శలు,గొడవలతో కొనసాగింది.