గ్రీన్ సూపర్ సెంచరీ..సన్ రైజర్స్పై ఖతర్నాక్ విక్టరీ

గ్రీన్ సూపర్ సెంచరీ..సన్ రైజర్స్పై  ఖతర్నాక్  విక్టరీ

వాంఖడే వార్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రోహిత్ సేన సన్ రైజర్స్ హైదరాబాద్ పై  8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

201 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు 3 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో రోహిత్ శర్మ ..కామెరూన్ గ్రీన్ దుమ్ము రేపారు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 1 సిక్స్, 8 ఫోర్లతో 56 పరుగులు సాధించాడు. కామెరూన్ గ్రీన్ 47 బంతుల్లో 8 సిక్సులు, 8 ఫోర్లతో సెంచరీ సాధించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.  అయితే హాఫ్ సెంచరీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (56) ఔట్ అయ్యాడు. 

గ్రీన్ సెంచరీ..

ఈ సమయంలో గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్లతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. రైజర్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. కేవలం 47 బంతుల్లో 8 సిక్సర్లు, 8 ఫోర్లతో శతకం సాధించాడు. ఇతనికి సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 25 రన్స్ తో సహకరించడంతో 18 ఓవర్లలో 2 వికెట్లకు 201 పరుగులు చేసి విజయం సాధించింది. 
భువనేశ్వర్ కుమార్, మయాంక్ ధగర్ చెరో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్..20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు ఏకంగా 140 పరుగులు జోడించారు. అయితే 47 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 69 పరుగులు చేసిన వివ్రాంత్ శర్మ ఆకాశ్ మధ్వల్ ఔట్ చేశాడు. వివ్రాంత్ ఔటైనా మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడాడు. సిక్సులు, ఫోర్లతో వాంఖడేను హోరెత్తించాడు. 46 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్న మయాంక్ ను మధ్వల్ పెవీలియన్ చేర్చాడు. 

చివర్లో టపటపా..

ఆరంభం అదుర్స్ అనిపించిన సన్ రైజర్స్..చివర్లో తుస్ మంది. వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఇద్దరు ఔటయ్యాక..సన్ రైజర్స్ స్కోరు మందగించింది. ఫిలిప్స్(1), బ్రూక్ (0) విఫలమయ్యారు. అయితే క్లాసెన్ (18), మార్కరమ్ (13) చివర్లో రాణించడంతో సన్ రైజర్స్ చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు  200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో   ఆకాశ్ మధ్వల్ 4 వికెట్లు తీసుకున్నాడు. జోర్దాన్ ఒక వికట్ తీశాడు.