
ముంబై పరేల్‌లోని అతిపెద్ద మంటపం, లాల్బాగ్చా రాజా గణేశోత్సవంలో భక్తులు సమర్పించిన వస్తువుల వేలం ద్వారా కోటిన్నరకు పైగా ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 6తో ముగిసిన 20 రోజుల ఉత్సవంలో భక్తులు దానం చేసిన 108 బంగారు, వెండి ఆభరణాలు అలాగే ఇతర వస్తువులను వేలం వేశారు.
రికార్డ్ సృష్టించిన బంగారు బిస్కెట్: రాజేంద్ర లంజ్వాల్ అనే ఓ భక్తుడు రూ.11 లక్షలకు కొన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్ అత్యధిక ధర పలికిందని లాల్బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ చైర్పర్సన్ బాలాసాహెబ్ కాంబ్లే తెలిపారు.
గత సంవత్సరాలతో పోలిస్తే వేలం ద్వారా వచ్చిన మొత్తం తగ్గిన.. శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,12,000 అమ్ముడైంది. కానీ ఒక నెల క్రితం రూ. 1 లక్షకి కొంచెం ఎక్కువే ఉన్న, ఏడాది క్రితం రూ. 75 వేలకి దగ్గరగా ఉంది. అలాగే, ఈ సంవత్సరంలో బంగారం ధర 40% కంటే పైగా పెరగ్గా, వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి అని అన్నారు. లాల్బాగ్చా రాజాకి భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువుల బహిరంగ వేలం గురువారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగింది.
ప్రతి సంవత్సరం భక్తులు సమర్పించిన బంగారం, వెండిని వేలం వేస్తారు. ఈ వేలంలో కొన్న వాటిని భక్తులు ప్రసాదంల భావిస్తారు. 2024లో ఈ మండలానికి రూ. 5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64.32 కిలోల వెండి విరాళాలుగా వచ్చాయి. 990.6 గ్రాముల బరువున్న బంగారు గొలుసు రూ. 69.31 లక్షలకు వేలం వేశారు. 2023లో వేలం ద్వారా రూ.80.70 లక్షల ఆదాయం వచ్చింది. అలాగే 3.5 కిలోల బంగారం, 64 కిలోల వెండి విరాళాల ద్వారా వచ్చాయి.
లాల్బాగ్చా రాజా 92వ వార్షికోత్సవ విగ్రహాన్ని నవసచ రాజా అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్ముతారు కాబట్టి ఎంతో భక్తితో పూజిస్తారు. సంతానం కలగని జంటలు కూడా కోరిక నెరవేరాలని వస్తుంటారు. అలాగే కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి వెండి ఊయలని దానం చేస్తారు, దానిని ఇతర జంటలు ప్రసాదంగా స్వీకరిస్తారు. వేలం ద్వారా వచ్చిన మొత్తం రూ.1 కోటి 65 లక్షల 71 వేల 111. వేలంలో అమ్ముడైన మొత్తం బంగారు, వెండి వస్తువులు 108. అయితే అత్యంత విలువైన విరాళం 100 గ్రాముల బంగారు బిస్కెట్, ఇది రూ. 11,31,000కు అమ్ముడైంది.