కారు టైరు పేలి బోల్తా పడ్డ కారు.. నలుగురు మృతి

కారు టైరు పేలి బోల్తా పడ్డ కారు.. నలుగురు మృతి

నిజామాబాద్ జిల్లా: ముప్కాల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 44పై కార్ టైర్ పేలి యాక్సిడెంట్ అయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబంగా గుర్తించారు.

హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. కారులో మొత్తం ఏడుగురు ఉన్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.