ఈక్విటీ మార్కెట్ల ఒడిదొడుకులతో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అలర్ట్! జూలైలో ఏం చేశారంటే?

ఈక్విటీ మార్కెట్ల ఒడిదొడుకులతో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అలర్ట్! జూలైలో ఏం చేశారంటే?

Mutual Funds: దాదాపు 6 వారాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులను చూస్తున్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నాయి. జూలై మాసంలో మార్కెట్ల అస్థిరతల దృష్ట్యా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడులపై అప్రమత్తతను పాటించారు. 

జూలైలో అత్యధికంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు క్యాష్ రిజర్వ్స్ పెంచుకున్నట్లు వెల్లడైంది. ఏసీఈ ఈక్విటీస్ అందంచిన సమాచారం ప్రకారం జూలైలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద క్యాష్ రిజర్వులను జూన్ కంటే పెంచుకుని రూ.లక్ష 58వేల కోట్లు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత వాతావరణంలో అవకాశాలను సరైన సమయంలో పెట్టుబడులుగా మార్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ డబ్బును వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా స్టాక్స్ అధిక వాల్యుయేషన్స్ కారణంగా పెట్టుబడుల విషయంలో తొందరపాటుకు వారు అవకాశం ఇవ్వటం లేదని తెలుస్తోంది. 

క్యూ1 ఫలితాల సమయంలో కంపెనీల ఆదాయాలు పెరిగినప్పటికీ వాటి పనితీరును ప్రధానంగా ఫండ్ మేనేజర్లు పరిగణలోకి తీసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు శ్రీరామ్ బికెఆర్ వెల్లడించారు. గత నెలలో కంపెనీల ఆర్థిక ఫలితాలు ఊహించిన స్థాయిలో లేకపోవటం నుంచి యూఎస్ టారిఫ్స్ పెంపు వరకు వివిధ కారణాలు మార్కెట్లను ముందుకు నడిపించటం కొంత ఆందోళనలను పెంచిన సంగతి తెలిసిందే.

ఏఏ మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద జూలైలో ఎంత క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయో పరిశీలిస్తే.. 
* పరాగ్ పరేఖ్ మ్యూచువల్ ఫండ్స్ రూ.11వేల 795కోట్లు 
* యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ రూ.8వేల 717 కోట్లు

ఇదే సమయంలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్, సుందరమ్ మ్యూచువల్ ఫండ్స్ అధికంగా క్యాష్ కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా జూలై నుంచి రిటైల్ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను మరింతగా పెంచుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఫండ్ మేనేజర్లు తక్కువగా ఉన్న పెట్టుబడి అవకాశాల కారణంగా డబ్బును సరైన అవకాశాల కోసం పక్కన ఉంచొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

►ALSO READ | IPO News: ఆగస్టు 19న స్టార్ట్ అవుతున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో అదరగొడుతోంది..!