
ఎలోన్ మస్క్ ఎప్పుడూ ఏదో విషయంపై వార్తల్లో ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పట్నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ట్రైండింగ్ లో నిలుస్తుంటాడు. ఎప్పుడూ తన మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ X (గతంలో ట్విట్టర్) ఏదో ఒక మార్పు గురించి పోస్టులు చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా కూడా ఆయన ఓ పోస్ట్ చేశారు. కానీ ఈ సారి కంపెనీ వ్యవహారాల గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి..
టెస్లా, స్పేస్‌ఎక్స్ యజమాని తన కుమారుడు X AE A-XIIతో కలిసి ఉన్న ఓ హృదయపూర్వక చిత్రాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇది తండ్రి-కొడుకుల అద్భుతమైన క్షణాన్ని చూపిస్తోంది. Xలో పోస్ట్ చేసిన ఈ ఫొటో.., టెక్ బిలియనీర్ ప్రేమగా సంబోధించుకునే తన కొడుకు 'లిల్ X'తో ఓ మనోహరమైన క్షణాన్ని పంచుకుంటున్నట్లు చూపిస్తుంది. "నా స్పారింగ్ పార్టనర్‌తో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను" అని మస్క్ పోస్ట్ క్యాప్షన్‌లో రాసుకువచ్చాడు. ఈ చిత్రంలో మస్క్ తన చిన్న కొడుకు Xతో ఉల్లాసభరితమైన మార్షల్ ఆర్ట్స్‌లో నిమగ్నమై ఉన్నాడు. తండ్రి, కొడుకులు ఈ ఫొటోలో సాధారణ దుస్తులు కనిపిస్తూ.. నేచురల్ గా కనిపిస్తున్నారు.
SpaceX CEO కొన్ని గంటల క్రితమే ఈ చిత్రాన్ని పంచుకున్నారు, ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టు 23 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్, 4 లక్షల 48 వేల లైక్‌లు, 19వేల కంటే ఎక్కువ రీపోస్ట్‌లను పొందింది. కొంతమంది యూజర్స్.. ఈ చిత్రాన్ని చూడడానికి చాలా బాగుంది అని అంటుండగా, మరికొందరు లిల్ Xని అందమైన బాలుడు అని పిలిచారు.
మస్క్ ఇటీవలే తన కొడుకు X AE A-XIIతో స్పేస్ ఎక్స్ కార్యాలయంలోనూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం అప్పట్లో వైరల్ అయ్యాయి. 2020లో మే 4న జన్మించిన X AE A-XII.. ఎలాన్ మస్క్ భార్య గ్రిమ్స్ మొదటి కొడుకు. ఇలా కొడుకుతో స్పేస్ ఎక్స్ కార్యాలయానికి రావడం ఇదే మొదటిసారి కావడంతో అంతా ఈ ఫొటోలను చూసేందుకు ఆసక్తి కనబర్చారు. వీటిని మస్క్ తల్లి మయే మస్త్.. లేట్ ఆన్ ఎ ఫ్రైడే నైట్ అనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో షేర్ చేసింది.
Practicing martial arts with my sparring partner pic.twitter.com/bifsH2Mejs
— Elon Musk (@elonmusk) August 12, 2023