సాగర్‌‌కు పోటెత్తుతున్న వరద

సాగర్‌‌కు పోటెత్తుతున్న వరద

హాలియా, వెలుగు:  శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌కు వరద పోటెత్తుతోంది.  సాగర్​కు 2,73,641 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.  మొత్తం 26  గేట్లలో 22 గేట్లను5 అడుగులు, 4  గేట్లను10 అడుగులు మేర ఎత్తి 2,30,182 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు 312. 0450 టీఎంసీలు కాగా  ప్రస్తుతం 587.40 అడుగులు 305.7464  టీఎంసీలకు చేరుకుంది.  కుడి కాల్వకు 8529 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 2400 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులు, విద్యుత్​ఉత్పత్తి ద్వారా 33,130 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.