మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే వీరేశం

మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే వీరేశం
  • నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం 

నకిరేకల్, (వెలుగు ):  మూసీ ప్రాజెక్టును  పర్యాటక కేంద్రంగా  తీర్చిదిద్దుతామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో రూ. 10 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మూసీ గెస్ట్‌‌ హౌస్‌‌ను పునరుద్ధరణ చేయడంతో పాటు, మత్య్సకారులకు బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.  

పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న  ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.  మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి,  పీఎసీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు,  పార్టీ నాయకులు పాల్గొన్నారు.