వర్గీకరణతో మాలలకు అన్యాయం

వర్గీకరణతో మాలలకు అన్యాయం
  • ది నేషనల్ అంబేద్కర్ సేన

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణతో రాష్ట్ర ప్రభుత్వం మాలలకు అన్యాయం చేస్తోందని ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణను నిరసిస్తూ శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ ను సీరియల్ ప్రకారం 22 నుంచి 16కు మార్చాలని కోరారు. 

వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ జాతీయ అధ్యక్షుడు రాజు వస్తాద్, అంబేద్కర్​ సేన రాష్ట్ర అధ్యక్షుడు తాలూకా రాజేశ్, దాసరి విశాల్, గోపోజి రమేశ్ బాబు, భాను ప్రసాద్ పాల్గొన్నారు.