పాఠశాలలు భవిష్యత్ కు మార్గదర్శకాలు : వళ్లంపట్ల నాగేశ్వర్ రావు

పాఠశాలలు భవిష్యత్ కు మార్గదర్శకాలు : వళ్లంపట్ల నాగేశ్వర్ రావు

నర్సంపేట, వెలుగు: పాఠశాలలు దేశ భవిష్యత్ కు మార్గదర్శకాలని జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సామాజిక కవి వళ్లంపట్ల నాగేశ్వర్ రావు అన్నారు. నర్సంపేట టౌన్ ఉదయశ్రీ హైస్కూల్​లో 1993 - 2025 వరకు టెన్త్​ బ్యాచ్​ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్​రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ పాఠశాలల్లో నిర్మితమై ఉందన్నారు. పాఠశాలను కాపాడుకోవలసిన అవసరం అందరిపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగదీశ్వర్, ప్రముఖ న్యాయవాది మోటూరి రవి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.