
తనదైన కామెడీ టైమింగ్‌తో నటుడిగా చక్కని గుర్తింపును అందుకున్న నవీన్ పొలిశెట్టి.. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నవీన్ లుక్ ఆకట్టుకుంది.
తనకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రీ వెడ్డింగ్ వీడియోకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌లో నవీన్ చేతికి గాయమవడంతో ఆలస్యమైంది. సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఉండే క్రేజ్ దృష్ట్యా సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయబోతున్నారు.