కాగజ్ నగర్ నవోదయలో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ షురూ

కాగజ్ నగర్ నవోదయలో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ షురూ
  • రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల స్కూళ్ల స్టూడెంట్స్ హాజరు

కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలోని తొమ్మిది నవోదయ స్కూళ్ల క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కాగజ్ నగర్ లో మొదలైంది. రెండు రోజుల పాటు జరిగే పోటీలను బుధవారం సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నవోదయ పాఠశాలల స్టూడెంట్స్ తరలివచ్చారు.  

క్లస్టర్ లెవల్ లో మొత్తం18 జట్లు పాల్గొంటున్నాయి. పోటీల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వాలీబాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు కాగజ్ నగర్ నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ పార్వతి తెలిపారు.