రూ.4,419 కోట్లు జేబులో వేసుకున్నారు .. బైజూస్​పై ఇన్వెస్టర్ల ఆరోపణలు

రూ.4,419 కోట్లు జేబులో వేసుకున్నారు .. బైజూస్​పై ఇన్వెస్టర్ల ఆరోపణలు

బెంగళూరు: ఎడ్​టెక్​ కంపెనీ బైజూస్‌‌‌‌‌‌‌‌ యాజమాన్యం యుఎస్‌‌‌‌‌‌‌‌లోని హెడ్జ్ ఫండ్‌‌‌‌‌‌‌‌ ద్వారా రూ.4,419 కోట్లు (533 మిలియన్ డాలర్లు) అక్రమంగా సంపాదించిందని ఇన్వెస్టర్లు ఆరోపించారు.  ఇటీవల మొదలుపెట్టిన 200 మిలియన్ డాలర్ల విలువైన రైట్స్​ఇష్యూను నిలిపివేసేలా ఆదేశించాలని బెంగళూరులోని ఎన్సీఎల్టీని కోరారు.  ఇన్వెస్టర్ల ఆరోపణలపై మూడు రోజుల్లోగా రాతపూర్వకంగా స్పందించాలని కంపెనీ లా కోర్ట్​ బైజూస్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. 

అప్పటి వరకు  తన ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను రిజర్వ్ చేసింది.  రైట్స్​ఇష్యూ బుధవారం ముగుస్తుంది.  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు -బెంచ్ ముందు  నలుగురు వాటాదారులు చేసిన ఆరోపణలపై బైజూస్ స్పందించలేదు. ఇప్పటి వరకు స్టే రాలేదు కాబట్టి రైట్స్​ఇష్యూ కొనసాగుతుందని  సంస్థకు సన్నిహిత వర్గాలు తెలిపాయి.   పెట్టుబడిదారులు కంపెనీకి అడ్డంకులు సృష్టిస్తున్నారని కంపెనీ వాదించింది.  అయితే బైజూస్​ నుంచి నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.