World Cup 2023: తెలుగోడి సత్తా.. ప్రాక్టీస్‌లో పాక్ టీంని వణికించాడు

World Cup 2023: తెలుగోడి సత్తా.. ప్రాక్టీస్‌లో పాక్ టీంని వణికించాడు

ప్రపంచకప్ సమరానికి మరో వారం రోజుల సమయం ఉన్నా.. వార్మప్ మ్యాచులు నేడు ప్రారంభం కానున్నాయి. భారత్ లోని పరిస్థితులను అంచనా వేయడానికి  అన్ని జట్లకు ఈ ప్రాక్టీస్ మ్యాచులు కీలకం కానున్నాయి. ఇందులో భాగంగా నేడు మూడు ప్రాక్టీస్ మ్యాచులు జరగనుండగా పాకిస్థాన్-న్యూజీలాండ్ జట్లు నేడు హైదరాబాద్ లో తలపడతాయి. రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పాకిస్థాన్ ప్రాక్టీస్ సందర్భంగా ఒక తెలుగు బౌలర్ హైలెట్ గా నిలిచాడు. ఇంతకీ ఈ  బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 
 
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తమ నెట్ బౌలర్ గా తెలుగు పేసర్ నిశాంత్ ని నియమించుకున్నారు. అయితే ఊహించని విధంగా నిశాంత్.. నెట్స్ లో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. నిశాంత్ బౌలింగ్ కి  ఫిదా అయిన పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఈ యువ పేసర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నిశాంత్ లో అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని.. అతడు కచ్చితంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని చెప్పుకొచ్చాడు.

ఆరు అడుగులకుపైగా ఉన్న నిశాంత్..గంటకి 140 నుంచి 150 వేగంతో బంతులు వేయగలడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, బ్యాట్ కమ్మిన్స్ తనకు ఆదర్శమని.. హైదరాబాద్ కు ఆడాలనేది తన కోరిక అంటూ తెలియజేశాడు. కాగా.. ఈ  నెల 29 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతాయి. రేపు గౌహతి వేదికగా భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచులో తలపడతాయి. ఇక అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ అసలు సమరం ప్రారంభం అవుతుంది.