రేపు రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

రేపు రాష్ట్రానికి  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు.  సుమారు రూ. 5,416 కోట్లతో 167  కిలోమీటర్ల మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లోని కాగజ్ నగర్, హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో జరిగే రెండు వేర్వేరు కార్యక్రమాల్లో గడ్కరీ భూమిపూజ,  ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఆరాంఘర్– శంషాబాద్ మధ్యలో ఆరు లేన్ల రోడ్డు, అంబర్ పేట చే నంబర్ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్, బీహెచ్ఈఎల్ దగ్గర ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. అలాగే, విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ల తొలగింపు ప్రాజెక్టుతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు.