తెలంగాణలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు: శాంతి కుమారి

తెలంగాణలో తాగునీటికి ఎలాంటి  ఇబ్బందులు లేవు: శాంతి కుమారి


తెలంగాణలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు సీఎస్  శాంతి కుమారి. తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై మార్చి 26వ తేదీ మంగళవారం రోజున  కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.  ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు చేపట్టడం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. 

SRSP, ఎల్లంపల్లి, సాగర్ లో నీటి నిల్వలున్నాయని..  ఏప్రిల్ 2వ వారంలో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ నిర్వహిస్తామని సీఎస్  శాంతి కుమారి తెలిపారు.  మూడు ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యత ఉందని ..   సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం నిధులు విడుదల చేశామని చెప్పారు.  ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు.  

రాష్ట్రంలో ఈ సారి లోటు వర్షపాతం ఉన్నా, ఇక్కడి ప్రధాన జలాశయాలు, ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌తో గత సంవత్సరం మాదిరిగానే నీటి మట్టాలున్నందున ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.