గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
  • ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఈనెల 22లోగా
  • 6, 7, 8వ తరగతులకు జూన్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలి
  • మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల స్కూల్స్/కాలేజీలు

హైదరాబాద్: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 6, 7, 8వ తరగులు మరియు ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు సూచించారు. 
దరఖాస్తుల ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2022 - 23 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే  040-23322377, 23328266 ఫోన్ నెంబర్లకు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన సూచించారు. 

 

ఇవి కూడా చదవండి

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా తెలంగాణ బిడ్డ

వస్తున్నా అంటున్న జూ.ఎన్టీఆర్

గుడ్ న్యూస్: తగ్గనున్న వంటనూనెల ధరలు