రుడ్‌‌‌‌, సిట్సిపాస్‌‌‌‌ ఔట్‌‌‌‌.. మూడో రౌండ్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌, స్వైటెక్‌‌‌‌

రుడ్‌‌‌‌, సిట్సిపాస్‌‌‌‌ ఔట్‌‌‌‌..  మూడో రౌండ్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌, స్వైటెక్‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌: యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో మూడో రోజు సంచలనాలు నమోదయ్యాయి. ఐదోసీడ్‌‌‌‌ కాస్పర్‌‌‌‌ రుడ్‌‌‌‌, ఏడో సీడ్‌‌‌‌ సిట్సిపాస్‌‌‌‌కు రెండో రౌండ్‌‌‌‌లోనే చుక్కెదురైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ చైనీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ జాంగ్‌‌‌‌ జిజెన్‌‌‌‌ 6–4, 5–7, 6–2, 0–6, 6–2తో రుడ్‌‌‌‌కు షాకిచ్చాడు. ఫలితంగా ఏటీపీ ర్యాంకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌–5లో ఉన్న ప్లేయర్‌‌‌‌ను ఓడించిన తొలి చైనా ప్లేయర్‌‌‌‌గా జాంగ్‌‌‌‌ రికార్డులకెక్కాడు. 3 గంటలా 19 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో జాంగ్‌‌‌‌ 18 ఏస్‌‌‌‌లతో హడలెత్తించాడు. 17 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో ఐదింటిని కాచుకున్నాడు. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో ఏడు ఏస్‌‌‌‌లే కొట్టిన రుడ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు.

 మరో మ్యాచ్‌‌‌‌లో సిట్సిపాస్‌‌‌‌ (గ్రీస్‌‌‌‌) 5–7, 7–6 (7/2), 7–6 (7/5), 6–7 (6/8), 3–6తో డొమినిక్‌‌‌‌ స్ట్రికెర్‌‌‌‌ (స్విట్జర్లాండ్‌‌‌‌) చేతిలో కంగుతిన్నాడు. ఇతర మ్యాచ్‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ (సెర్బియా) 6–4, 6–1, 6–1తో జపాటా మిరాలెస్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌)పై, సినెర్​ (ఇటలీ) 6–4, 6–2, 6–4తో సోనెగో (ఇటలీ)పై, తియాఫో (అమెరికా) 6–3, 6–1, 6–4తో ఒఫ్నెర్‌‌‌‌ (ఆస్ట్రియా)పై, షెల్టన్‌‌‌‌ (అమెరికా) 7–6 (7/1), 1–0తో డొమినిక్‌‌‌‌ థీమ్‌‌‌‌ (ఆస్ట్రియా)పై, ఫ్రిట్జ్‌‌‌‌ (అమెరికా) 6–1, 6–2, 6–2తో వారిల్లాస్‌‌‌‌ (పెరూ)పై గెలిచి మూడో రౌండ్‌‌‌‌లోకి అడుగుపెట్టారు. 

విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌లో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ 6–3, 6–4తో సావిల్లె (అస్ట్రేలియా)పై, వొజ్నియాకి (డెన్మార్క్‌‌‌‌) 7–5, 7–6 (7/5)తో పెట్రా క్విటోవా (చెక్‌‌‌‌)పై, బ్రాడీ (అమెరికా) 6–1, 2–6, 6–2తో లినెటీ (పోలెండ్‌‌‌‌)పై, మార్టినెజ్‌‌‌‌ (బెల్జియం) 3–6, 7–6 (9/7), 6–1తో కొలిన్స్‌‌‌‌ (అమెరికా)పై, జుహు (చైనా) 6–3, 6–3తో అజరెంకా (బెలారస్‌‌‌‌)పై, ముచోవా (చెక్‌‌‌‌) 6–3, 6–3తో ఫ్రెంచ్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌)పై గెలవగా, నాలుగోసీడ్‌‌‌‌ రిబకినా (కజకిస్తాన్‌‌‌‌)కు వాకోవర్‌‌‌‌ విజయం లభించింది.