UPI payments: శ్రీలంక, మారిషస్లోనూ UPI చెల్లింపులు చేయొచ్చు

UPI payments: శ్రీలంక, మారిషస్లోనూ UPI చెల్లింపులు చేయొచ్చు

టూరిస్టులకు గుడ్న్యూస్.. శ్రీలంక, మారిషస్లలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI)  సేవల అందుబాటులోకి రానున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 12) ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూపీఐ సేవలను ప్రారంభించనున్నారు. UPI తో పాటు రూపే కార్డ్ సేవలను రెండు దేశాల్లో ప్రధాని ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 1గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

శ్రీలంక, మారిషస్ తో భారత్ కు ఉన్న బలమైన సాంస్కృతిక, పరస్పర సంబంధాల దృష్ట్యా ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. దీంతో భారత్ నుంచి శ్రీలంక, మారిషస్ లకు వెళ్లే భారతీయ పౌరులకు , ఈ రెండు దేశాలనుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అంతరాయం లేని డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని , దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంచుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.