ఫోన్ మాట్లాడేటప్పుడు.. ఈ తప్పులు చేశారా హ్యాకర్లకు చిక్కినట్లే

ఫోన్ మాట్లాడేటప్పుడు.. ఈ తప్పులు చేశారా హ్యాకర్లకు చిక్కినట్లే

సైబర్ నేరగాళ్లు ఫోన్లను హ్యాకింగ్ చేయడానికి  కొత్త పద్దతులను అవలంభిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాల్ మాట్లాడే సమయంలో మనం చేసే కొన్ని తప్పులు సైబర్ నేరగాళ్లకు చేతికి చిక్కేలా చేస్తాయి. అటువంటి మూడు తప్పులను గురించి తెలుసుకుందాం. ఈ తప్పులు చేస్తే మీ ఖాతా, ఫోన్ రెండూ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. 

హ్యాకింగ్ కు సంబంధించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. హ్యాకింగ్ చేసేందుకు సైబర్ మోసగాళ్లు ఎప్పటికపడు కొత్త ట్రిక్ తో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఏదీ కావాలన్నా మనం ఇంటర్నెట్ పై ఆధారపడతాం. అది లేకుండా పని జరగదు. అందువల్ల హ్యాకింగ్ కు ఎవరూ బలికాకుండా ఉండటానికి కొన్ని విషయాలను ప్రత్యేకంగా ఉంచడం మంచింది. 

హ్యాకర్లు చాలా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ వినియోగదారులను మోసం చేయడానికి మీకు కాల్ చేసి కూడా డబ్బు దోపిడీ చేయడానికి ఉన్న అన్ని దారులు వాడుతున్నారు. ఇది ఎలా జరుగుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోకతప్పదు. 

అవును ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఫోన్ లో ఉండగానే వినియోగదారుడి అకౌంట్ ను ఖాళీ చేసిన సందర్భాలు చాలా వెలుగులోకి వచ్చాయి. అందువల్ల మీరు కూడా హ్యాకింగ్ ను నివారించాలనుకుంటే కాల్ సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ మూడు తప్పులను ఎప్పుడూ చేయొద్దు.. 

ఫోన్ కాల్ సమయంలో చాలాసార్లు, హ్యాకర్లు బ్యాంక్ ఉద్యోగి లేదా అధికారి అని మీకు కాల్ చేస్తారు. కాల్ సమయంలో వారు యాప్ ని డౌన్ లోడ్ చేయమని వినియోగదారుని కోరినట్లు నటిస్తారు. అయితే పొరపాటున కూడా అలా చేయ కూడదు. అలా చేస్తే మీరు పప్పులో కాలు వేసినట్లే..ఎందుకంటే ఈ యాప్ లు VPN యాప్ లు. దీని ద్వారా హ్యాకర్లు ఫోన్ కి పూర్తి యాక్సెస్ ని తీసుకొని దానిని స్వయంగా నియింత్రిస్తారు. 

ఫోన్ కాల్ సమయంలో హ్యాకర్ తరుచుగా మేసేజ్ లు పంపుతాడు. దానిలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయమని అడుగుతాడు. కానీ మారు దీనిని చేయకూడదు. మేసేజ్ లో ఇచ్చిన లింక్ నకిలీ కావచ్చు. దాని ద్వారా హ్యకర్ మీ ఫోన్ యాక్స్ చేయవచ్చు. మీ డేటాను స్టీల్ చేయొచ్చు. 

కాల్ సమయంలో హ్యార్లు ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతానుంచి ఛార్జీ తీసివేయబడుతుంటే సెట్టింగ్ ను ఆఫ్ చేయమని చెపుతారు. సెట్టింగ్ ను ఆఫ్ చేయడానికి అతను మిమ్మల్ని నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ యాప్ ని తెరవమని ఫోన్ లోనే అడుగుతాడు. తద్వారా అతను మీకు దశల వారీగా మార్గనిర్దేశం చేస్తూ సెట్టింగులను మార్చుతారు.ఇలాంటి మీరు చేస్తే మోసపోతారు. మీ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఒక పొరపాటు చేస్తే ఖాతాలోని డబ్బు మొత్తం హ్యాకర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయొద్దు.