ట్రంప్‌‌కు రిపోర్టర్ కాల్

ట్రంప్‌‌కు రిపోర్టర్ కాల్

న్యూయార్క్‌‌: వెనెజువెలా ప్రెసిడెంట్​మదురో, ఆయన భార్య సియాలీ అమెరికా దళానికి చిక్కారని పోస్ట్ చేసిన 10 నిమిషాలకే ప్రెసిడెంట్​ట్రంప్‌‌కు న్యూయార్క్‌‌ టైమ్స్ (ఎన్‌‌వైటీ) రిపోర్టర్ నేరుగా కాల్​చేశారు. సరిగ్గా తెల్లవారుజాము 4:31 గంటలకు రిపోర్టర్ టైలర్ పేజర్ నేరుగా ట్రంప్ సెల్‌‌ఫోన్‌‌కు కాల్ చేశారని, ఆయన ఫోన్‌‌ ఎత్తి మాట్లాడారని న్యూయార్క్ టైమ్స్​ తెలిపింది. ‘‘పేజర్‌‌‌‌ కాల్ చేయగా.. మూడు రింగుల తర్వాత ట్రంప్ స్వయంగా ఫోన్ ఎత్తి ‘హలో’ అని అన్నారు. రిపోర్టర్ తనను తాను పరిచయం చేసుకుని, ఆపరేషన్ గురించి ప్రశ్నలు అడిగారు.

సుమారు 50 సెకండ్లపాటు సాగిన ఈ సంభాషణలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ట్రంప్ నేరుగా చెప్పకుండా కొన్ని గంటల తర్వాత జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ చూడాలని చెప్పి ఫోన్ పెట్టేశారు” అని ఎన్‌‌వైటీ కథనంలో పేర్కొన్నది. కాగా, తన కెరీర్‌‌లో ప్రెసిడెంట్‌‌కు నేరుగా కాల్ చేయడం ఇదే మొదటిసారి అని టైలర్ పేజర్ చెప్పారు. ట్రంప్ దశాబ్దాలుగా విలేకరులతో మాట్లాడుతున్నారని, న్యూయార్క్‌‌లో రియల్ ఎస్టేట్ డెవలపర్‌‌గా ఉన్న కాలం నుంచి ఆయన విలేకరులకు మాత్రమే కాకుండా.. చట్టసభ సభ్యులు, సిబ్బంది, స్నేహితులు, విదేశీ నాయకులకు అందుబాటులో ఉండటానికి ఇష్టపడతారని టైలర్‌‌‌‌ చెప్పారు.