చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

చట్టసభల్లో బీసీలకు  రిజర్వేషన్లు కల్పించాలి
  • ఢిల్లీ జాతీయ ఓబీసీ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అఖిలపక్ష ఎంపీల డిమాండ్ 

న్యూఢిల్లీ, వెలుగు: చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లోని గురజాడ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతలు బోను దుర్గా నరేష్, గుజ్జ కృష్ణ, కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించారు. దీనికి 36 బీసీ సంఘాలు, 28 బీసీ కుల సంఘాలు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ నుంచి 32 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. 

ఎంపీలు మల్లు రవి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, పాకాల సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. తామెంతో మాకంత అన్నట్లు చేయాలని ఎంపీ మల్లు రవి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దేశానికి బీసీ ప్రధానిగా ఉన్నా.. బీసీలకు అన్యాయమే జరుగుతోందని ఫైర్ అయ్యారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి బీసీ డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.