డైరెక్ట్  రిక్రూట్​మెంట్​ ఖాళీలు 45 వేలే!

డైరెక్ట్  రిక్రూట్​మెంట్​ ఖాళీలు 45 వేలే!

హైదరాబాద్, వెలుగు: డైరెక్ట్  రిక్రూట్​మెంట్​ వేకెంట్  పోస్టులను గుర్తించే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఏయే డిపార్ట్​మెంట్​లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే దానిపై  ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ అన్ని శాఖల హెచ్​వోడీలతో ఆదివారం సమావేశమై  వివరాలను తెప్పించుకుని చర్చించింది. సీఎం కేసీఆర్ 50 వేల పోస్టులని చెప్పినప్పటికీ 45,281  డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​​ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు  ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ సమావేశంలో ఆఫీసర్లు తేల్చారు. వీటన్నింటికీ సర్కార్ నుంచి దశలవారీగా అనుమతులు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అలాగే సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే వాటికి ముందుగా పర్మిషన్ ఇచ్చేలా ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ నోట్ రెడీ చేస్తోంది. గుర్తించిన 45 వేల ఉద్యోగాలను ఒకేసారి కాకుండా దశలవారీగా భర్తీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎస్ కు సోమవారం రిక్రూట్​మెంట్​ పై ఒక రిపోర్ట్ ను అందజేయనున్నారు. అదే ఫైల్ ను మంగళవారం జరిగే కేబినెట్ భేటీకి పంపించనున్నారు. టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవే కాకుండా, ఇన్​స్టిట్యూట్ల వారీగా ఎలా రిక్రూట్​మెంట్​ చేపట్టాలనే దానిపై కూడా అధికారులు ఒక అవగాహనకు వచ్చారు.
గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులపైనా ఆరా 
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక్క గ్రూప్ – 1 నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. గ్రూప్ 1 సర్వీసుల్లో దాదాపు 50 శాతం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో ఒకసారి సీఎం కేసీఆర్ గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడమే తప్ప ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. అయితే ఖాళీల వివరాల సేకరణలో భాగంగా గ్రూప్ 1 పోస్టులపై కూడా ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. ఇటీవల ప్రమోషన్లు ఇవ్వడంతో ఏర్పడిన ఖాళీలపై అడిగి తెలుసుకున్నారు. వీటికి పర్మిషన్ ఇచ్చేందుకు కొంత టైం పడుతుందని అంటున్నారు. టీచర్లు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులే ఎక్కువ ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ గుర్తించిన 45 వేల డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ పోస్టుల్లో ఎక్కువగా టీచర్​, జూనియర్​ అసిస్టెంట్​ పోస్టులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో టీచర్​ పోస్టులు, ప్రైమరీ, హైస్కూళ్లలో టీచర్​ పోస్టులే వేల సంఖ్యలో ఉంటాయని తెలుస్తోంది. అలాగే గ్రూప్ 3, 4 కింద భర్తీ చేయాల్సిన జూనియర్  అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్​ పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఖాళీలు 1.91 లక్షలు ఉన్నా..
ఖాళీలుగా చూపించిన పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న స్ట్రెంత్ ను ప్రస్తావించలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి పీఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం శాంక్షన్డ్ క్యాడర్ స్ట్రెంత్ 4,91,304 ఉండగా..  ప్రస్తుతం 3,00,178 మంది ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం నేరుగా భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 1,08,528 మందితో పనిచేయిస్తోంది. వీటిని వేకెన్సీల్లో చూపించడం లేదు. 45 వేల పోస్టులే ఖాళీగా ఉన్నట్లు పేర్కొంటూ ఆఫీసర్లు రిక్రూట్​మెంట్ నోట్ ను రెడీ చేస్తున్నారు.
ఉద్యోగాలు 45 వేలే

ఇందులో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ(పోలీస్),  కమర్షియల్ టాక్స్ అధికారులు, రిజిస్ట్రార్, జిల్లా పంచాయత్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ వెల్ఫేర్‌‌‌‌ ఆఫీసర్స్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు,  జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితర 18 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ఐదేండ్లు అవుతోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా ఆ పోస్టులకు కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది.  దాదాపు 14 డిపార్ట్​మెంట్లకు సంబంధించిన పోస్టులు గ్రూప్ 2 కింద ఉన్నాయి.
దశలవారీగా పర్మిషన్లు
ప్రస్తుతం ఉన్న ఖాళీలను మొదటి దశలో, ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేస్తామని సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ గుర్తించిన 45 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది. ఫేజ్ ల వారీగా భర్తీ చేసేలా రిక్రూట్మెంట్ బోర్డులకు అనుమతి ఇస్తారని అధికారులు కూడా చెప్తున్నారు. వేకెంట్ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయడం కుదరదని, సర్కార్ నుంచి ఉన్న ఆర్డర్స్ ప్రకారం కొన్ని పోస్టులను నింపుతామని డిపార్ట్​మెంట్లకు స్పష్టం చేశారు. ఆర్థిక భారం తప్పించుకునేందుకే ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.