న్యూ ఇండియా అస్యూరెన్స్​లో ఆఫీసర్స్​

న్యూ ఇండియా అస్యూరెన్స్​లో ఆఫీసర్స్​

ది న్యూ ఇండియా అస్యూరెన్స్​ కంపెనీ లిమిటెడ్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. 
మొత్తం ఖాళీలు: 300
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైన డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయసు: 1 ఏప్రిల్​ 2021 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రిలిమ్స్​, మెయిన్స్​ (ఆబ్జెక్టివ్​, డిస్క్రిప్టివ్​ టెస్ట్​), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
ఎగ్జామ్ ప్యాటర్న్​: ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్షకు 60 నిమిషాల సమయం కేటాయించారు.
మెయిన్స్​ ఎగ్జామ్​: ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్​ టెస్ట్​, 30 మార్కులకు  డిస్క్రిప్టివ్​ టెస్టు (లెటర్​ రైటింగ్​ 10 మార్కులు, ఎస్సే 20 మార్కులు) ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఆన్​లైన్​లో నిర్వహిస్తారు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్ ఉంటుంది. 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. 
అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కు​ రూ.100 చెల్లించాలి.
చివరితేది: 21 సెప్టెంబర్​ 
ఫేజ్​1 ఆన్​లైన్​ ఎగ్జామ్​: అక్టోబర్​ 2021
ఫేజ్​2 ఆన్​లైన్​ ఎగ్జామ్​: నవంబర్​ 2021
వెబ్​సైట్​: www.newindia.co.in