
- దుకాణదారుడిపై వినియోగదారుల ఆగ్రహం
జీడిమెట్ల, వెలుగు: గడువు ముగిసిన కూల్డ్రింక్స్విక్రయించిన వ్యక్తిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రగతినగర్వసంతనగర్ కాలనీ శ్రీ నిలయం కోఆపరేటివ్సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనానికి తరలించారు.
ఈ సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు దాదాపు 100 మంది ప్రగతినగర్ క్రిష్మార్ట్లో కూల్డ్రింక్స్ కొనుగోలు చేశారు. వాటిని తాగే క్రమంలో గడువు ముగిసిందని గుర్తించి, యజమానిని నిలదీశారు. దుకాణం లోపలికి వెళ్లి చూడగా అన్ని రకాల కూల్డ్రింక్స్గడువు ముగిసినవే ఉండటంతో అతనిపై మండిపడ్డారు. పోలీసులు, ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు.