చెత్త అంట : 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్

చెత్త అంట : 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్

మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్  గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్ చేసినట్లుగా తెలిపింది.  2023 నవంబర్ 1 నుంచి -30 మధ్య 71,96,000 ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా వెల్లడించింది. ఇందులో  దాదాపు 19,54,000 ఖాతాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపింది.  భారత ఐటీ నిబంధనలను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లుగా వాట్సాప్  వెల్లడించింది. భారతీయ ఖాతాలుగా చెలామణీ అవుతూ.. +91 కోడ్‌లేని ఖాతాలపై కూడా నిషేధం విధించినట్లు తెలిపింది. 

 భారత్ లో 500 మిలియన్లకు పైగా యూజర్స్ ను కలిగి ఉన్న వాట్సాప్..  యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పిస్తుంది.  ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సోషల్ మీడియా సంస్థ నెలవారీ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయాల్సి ఉంటుంది.  యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను పొందుపరాచాల్సి ఉంటుంది.