UstaadBhagatSingh: ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్’పై మేకర్స్ అప్డేట్..

UstaadBhagatSingh: ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్’పై మేకర్స్ అప్డేట్..

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్నట్టు ఆదివారం మేకర్స్ తెలియజేశారు.  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతంలో ఎప్పుడూ చూడని బెస్ట్ వేలో చూపించబోతున్నట్టు, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాసీవ్ ఫీస్ట్ కోసం సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.   

►ALSO READ | PEDDI: పూజా హెగ్డే, శ్రీలీల, సమంత.. ముగ్గురిలో పెద్ది ఐటమ్ భామ ఎవరంటే?

ఇందులో పవన్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. పార్థిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్, నాగ మహేశ్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ ఏడాది చివరిలో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.